![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 125 లో....సందీప్ కోపంగా శ్రీలత దగ్గరికి వచ్చి.. అన్నయ్యని అడిగి ఆస్తిలో వాటా కావాలి అని చెప్పు అంటాడు. నిన్ను ఈ ఆస్తికి వారసుడిని చెయ్యాలని చూస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్.. వాడికి పెళ్లి పిల్లలు అనే ఆలోచనే లేకుండా చేసింది ఇందుకేనా అంటూ.. ఏ విధంగా అయితే సీతాకాంత్ మనసులో పెళ్లి ఆలోచన లేకుండా చేసిందో సందీప్ కి చెప్తుంది.
ఆ తర్వాత పెద్దాయన సీతాకాంత్ పెళ్లి ప్రయత్నం ఆపట్లేదని మరొక ప్లాన్ వేసాను. దాంతో పూర్తిగా సీతాకాంత్ మనసులో పెళ్లి ఆలోచన తీసేసి.. అమ్మ, తమ్ముడు, చెల్లి వీళ్ళే లోకం అనుకునేలా మార్చేసానని సందీప్ కి చెప్తుంది శ్రీలత. ఇంకా కొన్నిరోజులు ఓపిక పట్టు అని సందీప్ కి శ్రీలత నచ్చజెప్పగా.. సరేనని సందీప్ అంటాడు. అదంతా విన్న రామలక్ష్మి సీతా సర్ ఆస్తి కొట్టేయడానికి వీళ్ళు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు.. ఎలాగైనా సీత సర్ ని ఈ మోసం నుండి కాపాడుకోవాలని రామలక్ష్మి అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే ఈ సూట్ వేసుకోండి అంటూ రామలక్ష్మి ఇస్తుంది. అతనికి ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని ఇస్తుంటే సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. రామలక్ష్మి నిజం గానే ఒప్పుకుందా అని అనుకుంటాడు.
మీరు కచ్చితంగా ఆఫీస్ కి వెళ్లి తీరాలా అని రామలక్ష్మి అనగానే.. చిన్న వర్క్ ఉంది ఆఫీస్ లో అని సీతాకాంత్ అంటాడు మీరు మధ్యాహ్నం త్వరగా ఇంటికి రండి లేదంటే పూజకి లేట్ అవుతుందని రామలక్ష్మి చెప్తుంది. దానికి సీతాకాంత్ సరే అంటాడు. సీతాకాంత్ ఏదో ఆలోచిస్తుంటే.. మీరు ఇక్కడే ఉంటే ఎప్పుడు ఆఫీస్ కి వెళ్లి త్వరగా వస్తారు పదండి అంటూ రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ధన పూజకి ఏర్పాట్లు చేస్తుంటే సిరి చూసి.. నువ్వు ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది. మా అక్క చేస్తున్నా పూజ కదా అందుకే అని ధన అంటాడు. వాళ్ళు అయిష్టంతో పెళ్లి చేసుకున్నట్లు అనుకున్నాము కానీ వాళ్ళ బంధం ఇప్పుడు బలపడింది అని సిరి అంటుంది. అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు వస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |